న్యూఢిల్లీ : సాంకేతిక లోపం కారణంగా ప్రధాని మోడీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంతసేపు నిలిచిందని, తర్వాత దానిని పునరుద్ధరించామని మెటా మంగళవారం తెలిపింది. పరీక్షా పత్రాల లీకేజీపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రధాని మోడీ ఈ నెల 23న సెల్ఫీ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కంటెంట్‌ను పొరపాటున తొలగించి, తర్వాత పునరుద్ధరించామని మెటా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఫేస్‌బుక్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ వీడియో యాక్సెస్నఉ కొద్ది సేపు నిలిపివేసి, తర్వాత పునరుద్ధరించింది. జెన్‌జెడ్ ఆందోళనలను ఉద్దేశించి ప్రధాని మోడీ విడుదల చేసిన మొదటి వీడియో కావడం గమనార్హం. ప్రధాని వీడియోను తొలగించడంపై ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మెటా సంస్థకు సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్‌ను ఐటీ మంత్రిత్వ శాఖ పిలిపించిందని తెలిపాయి. ఆ వీడియోను పొరపాటున తొలగించామని, తర్వాత పునరుద్ధరించినట్లు మెటా ప్రతినిధి వెల్లడించినట్లు పేర్కొన్నాయి.
ప్రధాని సెల్ఫీ ఈ వీడియో పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి ప్రకటనలు కాదని.. పార్లమెంటులో చర్చ చేపట్టాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)