ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : నవచేతన యాప్ వేగవంతంగా పూర్తి చేయాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి అంగన్వాడీలకు సూచించారు. కొత్తపేట డివిజన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు మండలంలోని చెముడు లంక సెక్టార్ పరిధిలో నవ చేతన యాప్ పై అవగాహన సదస్సు మంగళవారం ఆమె అంగన్వాడీలకు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ నవచేతన యాప్ నందు చిన్నారుల బాల్యారంభ అభివృద్ధి స్క్రీనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖల సమన్వయంతో ప్రవేశపెట్టిందన్నారు. ఈ మొబైల్ ఆధారిత అప్లికేషన్ ప్రకారం మీ పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పూర్తి చేయాలన్నారు. నవచేతన యాప్ ముఖ్య ఉద్దేశ్యం 0 నుండి 6 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో ఎదుగుదల, లోపాలు, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం జరుగుతుందన్నారు. గర్భధారణ నుండి రెండేళ్ల వయస్సు వరకు అంటే తొలి 1000 రోజులు పిల్లల మెదడు అభివృద్ధి, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణను పర్యవేక్షించడం అన్నారు. ఇందులో అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బందికి స్క్రీనింగ్ ప్రక్రియలో సహాయం అందించాలని సూపర్వైజర్ వరలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు యు.సుశీల, మెర్సీ ఫ్లోరెన్స్, సిహెచ్. కుమారి, టి.విజయ, సిహెచ్. మంగతాయారు, వి.రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
నవచేతన యాప్ వేగవంతం చేయాలి : ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 01:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)