ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం కలెక్టరేట్ వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిర్వాసితులను నీటిలో ముంచొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వసితులు మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టుకు నీటి విడుదల నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించాలని కోరారు. అలాగే 2013 భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం నిర్వాసితులు తమ నివాసాలను ఖాళీ చేసేందుకు కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని నిర్వాసితులు స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను నీటిలో ముంచొద్దు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)