అహ్మదాబాద్ : బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు కేటుగాళ్లు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు బంగారాన్ని ముద్దగా మార్చి తన మలద్వారంలో దాచుకుని అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. చివరకు అధికారులకు చిక్కాడు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో జెడ్డా నుంచి అహ్మదాబాద్ కు చేరుకున్న 24 ఏళ్ల సర్ఫరాజ్ కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు తన మలద్వారంలో బంగారాన్ని ముద్దగా మార్చి దాచిపెట్టినట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు. నిందితుడి మలద్వారం నుంచి 467.09 గ్రాముల బంగారం ముద్దను అధికారులు వెలికితీశారు. ఆ బంగారం ముద్దను కరిగించి కడ్డీగా మార్చగా దాని బరువు 422.83 గ్రాములకు చేరినట్లు అధికారులు తెలిపారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ. 65.69 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అరెస్టు చేసి ఈ స్మగ్లింగ్ వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మలద్వారంలో బంగారం .. యువకుడు అరెస్ట్ ..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 12:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)