సిఐటియు జిల్లా కార్యదర్శి జి రాజు
ప్రజాశక్తి-నూజివీడు టౌన్ : నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో రైతు, వ్యవసాయ కార్మిక కార్మిక సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి రాజు మాట్లాడుతూ.. కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకపోగా పంటల భీమా రైతులు చేసుకోవాలని, వరి పంట లేదు కాబట్టి ఈక్రాప్ నమోదు చేయమని చెప్పటం ప్రభుత్వ దుర్మార్గ చర్యని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఆర్ రవీంద్రనాథ్, రైతు సంఘ రాష్ట్ర నాయకులు వై కేశ్వర రావు, సిఐటియు పట్టణ కార్యదర్శి ఎన్ ఆర్ హనుమాన్లు,సిపిఐ ఎంఎల్ నాయకులు దుర్గం పుల్లారావు, ఐఎఫ్టియు నాయకులు దేవుడు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)