సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పిఠాపురంలో జైలు భరో

1 గంట క్రితం

pitapuram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పిఠాపురం: కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జైలు భరో కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి పట్టణ పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీ సాగింది. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషాబాబ్జి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుర్రాల అప్పారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు, కొత్తపల్లి మండల సీఐటీయూ అధ్యక్షుడు, కార్యదర్శి కాళ్ల నాగేశ్వరరావు, కె.వి.వి. సత్యనారాయణ, సీపీఎం పిఠాపురం మండల కన్వీనర్‌ కుంచె చిన్న, సీఐటీయూ గొల్లప్రోలు మండల కన్వీనర్‌ ఓరుగంటి నందీశ్వరుడు, ప్రజా సంఘాల నాయకుడు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్