ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాతో ఒప్పందం వద్దేవద్దు

4 రోజుల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 10:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు

ప్రజాశక్తి - రెడ్డిగూడెం : అమెరికాతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందం పెట్టుకోవద్దని కోరుతూ కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎఐకెఎస్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎన్ఠీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమం చేసేందుకు రైతు సంఘం నాయకులు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతు సంఘం నాయకులతో పోలీసులు వాదనకు దిగడంతో రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మాధవరెడ్డి మాట్లాడుతూ అమెరికాతో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందం చాలా ప్రమాదకరంగా ఉంటుందని, కనుక అమెరికాతో ఒప్పందం పెట్టుకోవద్దని తెలిపారు. అలాగే దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలియజేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి అప్పిరెడ్డి, ఉయ్యూరు కృష్ణారెడ్డి, పాములపాటి సత్యనారాయణ రెడ్డి, వెంకటేశ్వర్రావు, పెద్ద వెంకటరెడ్డి, తుమ్మల వీరాస్వామి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్