మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యే నిజమైన సంపద

5 రోజుల క్రితం

vit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 11:56 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రెషర్ స్టూడెంట్ ఓరియేషన్ ప్రోగ్రాంలో విఐటి ఛాన్సలర్ డా. జి.విశ్వనాథన్

ప్రజాశక్తి - తుళ్లూరు : విద్యే నిజమైన సంపదని విఐటి ఛాన్సలర్ డా. జి.విశ్వనాథన్ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోని విఐటి విశ్వవిద్యాలయంలో గురువారం ప్రెషర్ స్టూడెంట్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం జరిగింది. 2026–27 విద్యా సంవత్సరానికి కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులను అధికారికంగా విశ్వవిద్యాలయంలోకి ఆహ్వానిస్తూ యూనివర్సిటీలో ఫ్రెషర్స్ స్టూడెంట్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ విద్యా వాతావరణం, అందుబాటులో ఉన్న అవకాశాలు, విలువలు, ఉన్నత విద్యా ప్రయాణంలో ఎదురయ్యే అవకాశాలు తదితర అంశాలపై నూతన విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులు, పరిశ్రమ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిచర్డ్ కింగ్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హైదరాబాద్ – రీజియన్ హెడ్, అకడమిక్ అలయన్సెస్), గౌరవ అతిధిగా సందల్ కొటావాలా (ఆల్ఫాలియస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ వ్యవస్థాపకుడు, సీఈఓ) హాజరయ్యారు. నూతన విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథి రిచర్డ్ కింగ్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టడం అనేది విద్యార్థుల జీవితంలో ఒక కొత్త ప్రయాణానికి నాంది అని పేర్కొన్నారు. తమలోని సామర్థ్యాలను గుర్తించుకోవడం, వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని అన్నారు. ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు తల్లిదండ్రులు అందించిన సహకారం, చేసిన త్యాగాలను విద్యార్థులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. యూనివర్సిటీ ఛాన్సలర్ డా. జి. విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి జీవితంలో సంపాదించగలిగే అత్యంత శాశ్వతమైన సంపద విద్యేనని పేర్కొన్నారు. తమిళ సాహిత్యంలో వ్యక్తమైన జ్ఞానాన్ని ప్రస్తావిస్తూ, విద్యను నాశనం చేయలేరని, దొంగిలించలేరని, ఎవరి నుంచి లాక్కోలేరని అన్నారు. భౌతిక సంపదకు భిన్నంగా విద్యను ఇతరులతో పంచుకున్న కొద్దీ అది మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఆర్థిక, సామాజిక ప్రగతిని సాధించాలనుకునే దేశాలు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. గౌరవ అతిథి సందల్ కొటావాలా మాట్లాడుతూ.. 2014లో విఐటి వెల్లూరులో విద్యార్థిగా ఉన్న తన వ్యక్తిగత ప్రయాణాన్ని నూతన విద్యార్థులతో పంచుకున్నారు.తన అధ్యాపకులు, డీన్ అందించిన ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకున్న ఆయన, యూనివర్సిటీ అందించిన స్వేచ్ఛాయుత వాతావరణం తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు, వాటిని ఆవిష్కరణలుగా మలచేందుకు ఎంతగానో దోహదపడిందని తెలిపారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. పి.అరుళ్మొళివర్మన్ మాట్లాడుతూ.. విద్య ఉద్దేశ్యం కేవలం ఒక డిగ్రీని సంపాదించడానికే పరిమితం కాదని పేర్కొన్నారు. విద్య అనేది కేవలం డిగ్రీ సంపాదించడం మాత్రమే కాదు; మనలోని సామర్థ్యాన్ని గుర్తించుకోవడం, ప్రతిభను పెంపొందించుకోవడం, జీవితంలో విజయాన్ని సాధించేందుకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడం అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్