సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఏడాదంతా ఎల్‌‌నినో ప్రభావం

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 12:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఉద్యోగుల పనితీరు మారాలి

  • ఆర్‌‌టిజిఎస్ సమీక్షలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్‌‌టిజిఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సిఎం సోమవారం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదంతా ఎల్‌నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతోపాటు, రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు. దాని ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను వివరించడంతోపాటు.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

ఏ ప్రాంతాల్లో ఏఏ పంట సాగు చేయాలనేదానిపై వివరించాలన్నారు. పంటల బీమా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల విషయంలో కొంత జాప్యం కనిపిస్తుందని అన్నారు. ఆలూరు నియోజకవర్గ పర్యటనలో ఉద్యోగుల పనితీరును చదివి వినిపించినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందనను అధికారుల వద్ద ప్రస్తావించారు. రంపచోడవరంలో విద్యార్థి శివాని ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావించారు. చదువులో టాపర్ అయిన శివాని చనిపోవడం చాలా ఆవేదన కలిగించిందని అన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు సైకో మెట్రిక్ టెస్టులను చేయించాలని విద్యాశాఖ ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

మానసిన పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల సేవలు తీసుకోవడంతోపాటు.. ఉపాధ్యాయులకు అవసరమైన మేరకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారధి, సిఎస్ సాయి ప్రసాద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్