న్యూఢిల్లీ : విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని, పలు రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) సోమవారం డిమాండ్ చేసింది. సిజెపికి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా కేంద్రం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటోందని సిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. అదుపులోకి తీసుకున్న నిరసనకారులందరినీ వెంటనే విడుదల చేయాలని, దేశవ్యాప్తంగా వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో విద్యార్థులు, నిరసనకారులను అరెస్టు చేసినట్లు తమకు నివేదికలు అందినట్లు సిజెపి అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం, నిర్బంధించడం, అరెస్టు చేస్తున్నారని తమకు అందిన నివేదికలపై తీవ్ర ఆందోళన చెందినట్లు వెల్లడించారు. బిజెపి లేదా ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల్లోని నిరసనకారులపై ఎటువంటి చర్యలు చేపట్టమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే దేశవ్యాప్త నిరసనను నిలిపివేసినట్లు ప్రకటించామని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు జె.పి.నడ్డా, జితేంద్రసింగ్‌లు వెంటనే జోక్యం చేసుకోవాలని, అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని కోరారు. వాటిపై మంగళవారం నాటికి లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించిందని స్పష్టం చేశారు. అరెస్టైన విద్యార్థులను విడుదల చేసేందుకు తమ న్యాయవాదుల బృందాన్ని సంప్రదిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంపైనే దాని విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని సౌరవ్ దాస్ అన్నారు. ఇచ్చిన హామీల నుండి ఏమాత్రం పక్కకు తప్పుకున్నా కేవలం సిజెపితోనే కాకుండా, లక్షలాది మంది భారతీయయువతతను నమ్మక ద్రోహం చేసినట్లేనని హెచ్చరించారు. మంగళవారం లోగా నిర్బంధంలో ఉన్నవారందరినీ విడుదల చేయాలని, అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని సిజెపి డిమాండ్ చేసింది. లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.
విద్యార్థులను విడుదల చేయాలి, ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలి : సిజెపి డిమాండ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)