ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హంద్రీనీవా కాలువలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-హంద్రీనీవా : గుంతకల్లు మండలం కసాపురం గ్రామం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువలోకి వృద్ధ దంపతులు దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. కసాపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెల్డోన గ్రామానికి చెందిన బోయ సామాజిక వర్గానికి చెందిన వృద్ధ దంపతులు బోయ చిదానంద (65), రామలింగమ్మ (60) ఆదివారం మధ్యాహ్నం కసాపురం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి వెంటనే కాలువలో గాలింపు చేపట్టి రామలింగమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. చిదానంద కోసం హంద్రీనీవా కాలువలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కుటుంబ కలహాల కారణంగానే దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్