ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నేపాల్‌ అద్భుతం.. శిథిలాల నుంచి సజీవంగా చిన్నారి వెలికితీత

1 గంట క్రితం

kid.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 05:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రసువా: నేపాల్‌లోని రసువా జిల్లాలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. భారీ వరద శిథిలాలు, బురద కింద మూడు రోజుల పాటు చిక్కుకుపోయిన ఆరేళ్ల బాలికను సహాయక బృందాలు సజీవంగా వెలికితీశాయి. రుసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో సాయుధ పోలీసు బలగాలు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా.. చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో వెంటనే మట్టి, శిథిలాల కింద చిక్కుకుపోయిన పాపను సహాయక సిబ్బంది గుర్తించి వెలికితీశారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కాఠ్‌మాండూ ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన తమవారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో సహాయక సిబ్బందితో పాటు ప్రజలు కూడా మట్టిదిబ్బలు, శిథిలాలను తొలగించి వెతుకుతున్నారు. నేపాల్‌ విలయంలో మృతుల సంఖ్య 700లకు దాటింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్