ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రేపు వెలిగొండ పండుగ వద్ద కలుసుకుందాం: సీఎం చంద్రబాబు ట్వీట్

1 గంట క్రితం

South Coast Railway Zone from Today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 05:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : మార్కాపురం జిల్లా గడ్డపై సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మూడు జిల్లాల్లోని లక్షలాది మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు పడనుందని, రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. కరవు పీడిత ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాలుగా కంటున్న వెలిగొండ కల, కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు దూసుకువస్తాయని, ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త రెక్కలు తొడుగుతాయని అన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని 'వెలిగొండ పండుగ' వద్ద కలుద్దామంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్