ప్రజాశక్తి–బత్తలపల్లి: శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామ సమీపంలోని శ్రీ అపరాధయ్య సమాధి వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను గ్రామస్తులు, పోలీసులు కలిసి అడ్డుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పామిడి మండలం పి.కొండాపురం గ్రామానికి చెందిన కొండూరు సుధీర్ రెడ్డి (28), తండ్రి తిప్పారెడ్డిగా గుర్తించారు. ఘటన స్థలం నుంచి ఒక థవేరా వాహనంతో పాటు గుప్తనిధుల కోసం తవ్వకాలకు ఉపయోగించిన పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తనతో పాటు మరికొందరు వచ్చినట్లు సుధీర్ రెడ్డి తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. వారి కోసం గాలింపు కొనసాగుతోందని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు.. ఒకరు అరెస్ట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 11:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)