ప్రజాశక్తి – పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం తిమ్మాపురం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు నడిపి వెంకటేష్ (50)గా పోలీసులు గుర్తించారు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, కుమారులు మురళి, నరసింహమూర్తి ఉన్నారు. స్థానికుల కథనం ప్రకారం, గుర్తు తెలియని వాహనం వెంకటేష్‌ను ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం దర్యాప్తు చేపట్టారు
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 11:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)