తిరువనంతపురం : కేరళలో వర్షాల ధాటికి 8మంది మరణించగా, 13మంది గాయపడినట్లు కేరళ ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ ఆదివారం పేర్కొన్నారు. శనివారం కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహం, వరదలు పోటెత్తడంతో ప్రాణనష్టం, గాయాలు, తీవ్రమైన ఆస్తి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. 5,792మందిని 209 సహాయక శిబిరాలకు తరలించారు. భారీగా ఆస్తినష్టం కూడా సంభవించిందని తెలిపారు. 27 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 196 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆగస్టు 5 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పథనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, పాలక్కాడ్, త్రిస్సూర్, మలప్పురం, కొజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కేరళలో వర్షాల ధాటికి 8మంది మృతి .. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 11:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)