ప్రజాశక్తి-ఒంగోలు: ఒంగోలు సంఘమిత్ర ఫ్లైఓవర్‌పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. విజయవాడ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ మరమ్మతుల కోసం రోడ్డుపై నిలిపి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు వారు వాహనంలో ఇరుక్కుపోయారు. లారీ డ్రైవర్ కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులను పల్నాడు జిల్లా అమరావతి మండలం దిడుగు గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ (27), తిరుపతమ్మ (24)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ.. ఇద్దరు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)