పిపిపి ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పథకాల అమలుకోసం ప్రతి శాఖకూ ఒక ఆర్ధిక ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులపై గురువారం నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆర్ధిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల విప్లవం నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టి వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పిపిపి ప్రాజెక్టులకు సస్టెయినబుల్ మోడల్‌లో అభివృద్ధి చేయాలని, ప్రతీ ప్రాజెక్టు వద్ద ఆర్ధిక కార్యకలా పాలకు అవకాశం ఉండేలా చూడాలని సిఎం చెప్పారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లాంటి వాటిని కూడా సమర్ధంగా వినియోగించుకోవాలన్నారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టుల్లో స్థానిక మత్స్యకారులను కూడా భాగస్వాములను చేసి వారికి ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రైవేటు భాగస్వామ్యం-విజీఎఫ్ పాలసీ 1.0 ను వచ్చే కేబినెట్ ముందుకు తీసుకురావాలన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వేర్వేరు విధానాలను కూడా అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. భవిష్యత్తులో పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ద్వారా జలవనరుల శాఖకు ఆదాయం వస్తుందని, సాగునీటి సంఘాలు కూడా ఈ ప్రక్రియలో కీలకంగా ఉంటాయన్నారు. అందుకే ప్రతీ ప్రభుత్వ శాఖ ఫైనాన్షియల్ ప్లాన్ ను తయారు చేసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆదాయ మార్గాలను నిర్దేశించుకోవాలన్నారు.
2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల మేరకు ప్రతీ ఏటా పిపిపి ప్రాజెక్టులకు 8 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఈ నిధులతో విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో భారీగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రతీ ప్రభుత్వ శాఖకూ ఓ ఫైనాన్షియల్ ప్లాన్చే పట్టవచ్చునని వివరిం చారు. ఓడరేవులు, షిప్ యార్డులు, ఎయిర్ పోర్టు లు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను ఇప్పటికే పిపిపి కింద చేపట్టినట్లు తెలిపారు. పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 1,23,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. అన్ని పిపిపి ప్రాజెక్టులనూ విజయవాడ, తిరుపతిలోని వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు 178 కోట్ల వీజీఎఫ్‌ను కేంద్రం ఇస్తోందని, మెడికల్ కాలేజీలకు 1,468 కోట్ల వీజీఎఫ్ రానుందని, ఈ ప్రాజెక్టులు చేపట్టిన విధానంపై కేంద్ర ఆర్ధిక వ్యవహారాల విభాగం ప్రశంసించిందని అధికారులు తెలిపారు.
వచ్చే కేబినెట్‌కు నూతన విధానం
ప్రభుత్వం వద్ద నిరర్ధకంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మలచుకోవాలని అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వానికి ఉన్న భూములను వాణిజ్య పరంగా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులను నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం ఆలోచన చేస్తోందన్నారు. ఐఐటి, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనూ చదివేలా వీరిని తీర్చి దిద్దాలని అన్నారు. ఈ సమీక్షలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖ ఉన్నతాధికా రులు పీయూష్ కుమార్, వి.వినయ్ చంద్, రోనాల్డ్ రోస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఐ అండ్ ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు.






కామెంట్‌లు (0)