సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం

1 గంట క్రితం

fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 08:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్టు ప్రధాన భవనంలోని మూడో ఫ్లోర్‌లోని ఓ గదిలో ఉన్నట్లుండి మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన భద్రతా సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. రెండు ఫైరింజన్లతో వారు స్పాట్‌కు చేరుకున్న సిబ్బంది మంటలు పక్కన ఉన్న ఇతర గదులకు, కోర్టు రికార్డు రూమ్‌లకు వ్యాపించకుండా మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.అర్ధరాత్రి సమయం కావడంతో కోర్టులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోర్టుకు సంబంధించిన ఏవైనా కీలకమైన పత్రాలు, ఫైళ్లు ఏమైనా కాలిబూడదయ్యాయ అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్