ముంబై : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై-పుణే కర్జాత్-లోనావాల బోర్‌ఘాట్ సెక్షన్‌లో రైల్వే ట్రాక్‌లపై భారీగా కొండచరియలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదకర పరిస్థితిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే అధికారులు, సిబ్బంది కలిసి పనిచేయాలని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ముంబై-పుణే మార్గంలోని కర్జాత్-లోనావాల బోర్‌ఘాట్ సెక్షన్‌లో రైల్వే ట్రాక్‌లపై కొండచరియలు, బండరాళ్లు విరిగిపడిన పరిస్థితిని సమీక్షించానని తెలిపారు. పునరుద్ధరణ పనుల కోసం తమ టీమ్ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. రైలు సర్వీసులన్నింటినీ త్వరగా పునరుద్ధరించేలా వెస్ట్రన్, సెంట్రల్ రైల్వే అధికారులు పనులు మొదలు పెట్టారని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. మరోవైపు రైల్వే ట్రాక్‌ల క్లియరెన్స్ పనులు పూర్తయిన వెంటనే ముంబై-పుణే మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతాయని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ముంబై-పుణే ఘాట్ సెక్షన్‌లో విరిగిపడిన కొండచరియలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 08:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)