చర్చనీయాంశమైన స్థల వివాదం
ప్రజాశక్తి-నార్పల(అనంతపురం): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణాన్ని గతంలో ఉన్న గోడ స్థానంలోనే తిరిగి ప్రారంభించారు. తొలుత ఆక్రమణకు గురైన కళాశాల స్థలాన్ని తిరిగి కలుపుతూ గుంతలు తవ్వినా, అనంతరం వాటిని పూడ్చివేసి యథాస్థానంలోనే నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశమైంది. ఇటీవల క్రీడాకారులు క్రికెట్ సిక్స్ లైన్‌కు గోడ అడ్డుగా వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేయగా, కళాశాల స్థల పరిరక్షణపై అదే స్థాయిలో స్పందన కనిపించలేదని పూర్వ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి బాబా సలాం తన పదవికి రాజీనామా చేశారు. ప్రహరీ గోడ నిర్మాణం ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకే జరుగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ బాలప్ప తెలిపారు. రోడ్డు వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని కళాశాల అవసరాలకు వినియోగిస్తారా, వ్యాపార సముదాయాలు నిర్మిస్తారా, లేక పార్కింగ్‌కే వదిలేస్తారా అన్న అంశంపై స్థానికంగా చర్చ సాగుతోంది.








కామెంట్‌లు (0)