సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA : 'ఇదే నా చివరి ప్రపంచకప్'.. రొనాల్డో ప్రకటన

1 గంట క్రితం

Cristiano Ronaldo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 09:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

2026 ఫిఫా ప్రపంచకప్‌తో తన ప్రపంచకప్‌ ప్రస్థానానికి ముగింపు పలకనున్నట్లు రొనాల్డో ప్రకటించాడు. స్పెయిన్‌తో జరగనున్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన భవిష్యత్తు ప్రణాళికలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు."2026 ప్రపంచకప్‌ నా చివరిది. ఈ టోర్నీని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాను. కానీ ఇదే నా చివరి మ్యాచ్‌ కాకూడదని ఆశిస్తున్నాను. నేను ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో నేనే నిర్ణయిస్తాను. ఆ ప్రశ్న పదేపదే అడగడం సమయం వృథా. జట్టుకు సహాయం చేయడానికి ఎప్పుడూ నా శరీరం, ఆత్మతో కట్టుబడి ఉంటాను. ప్రపంచకప్‌ గెలవగలమనే నమ్మకంతోనే మేము ఇక్కడికి వచ్చాం. ఆ లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాం" అని పేర్కొన్నాడు. ప్రస్తుతం టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గోల్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్న ఆయన, పోర్చుగల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపాలన్నదే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్