ఆరు దుకాణాలు దగ్ధం.. రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం
నంద్యాల: నంద్యాల జిల్లాలోని అహోబిలం దేవస్థానం ఎదురుగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దేవస్థానం ఎదురుగా ఉన్న ఆరు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో మూడు బొమ్మల దుకాణాలు, ఒక కూల్‌డ్రింక్స్ షాపుతో పాటు రెండు హోటళ్లు కాలిపోయాయి. అగ్ని ప్రమాదం కారణంగా దుకాణాల్లోని వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. హోటళ్ల వద్ద ఉన్న గ్యాస్ సిలిండర్లను పోలీసులు సకాలంలో తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. సిలిండర్లు మంటలకు గురై ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండేది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.





కామెంట్‌లు (0)