ప్రజాశక్తి-పాలకొల్లు: పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు డా. సిహెచ్. సత్యనారాయణమూర్తి (డా.బాబ్జీ) (85) కన్నుమూశారు. కొంతకాలంగా రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఉన్నారు. కుమారుడు, కుమార్తె గతంలోనే మరణించారు. వైద్య రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన డా. బాబ్జీ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ వైద్యులుగా గుర్తింపు పొందారు. ఆయన మరణవార్త తెలియడంతో పాలకొల్లుతో పాటు జిల్లావ్యాప్తంగా విషాదం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే పలువురు వైద్యులు, రాజకీయ ప్రముఖులు, వర్తకులు, కళాకారులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.
పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డా. బాబ్జీ కన్నుమూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 06:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)