బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘హత:’ విడుదల వాయిదా

1 గంట క్రితం

‘హత:’ విడుదల వాయిదా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 07:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కిరణ్‌ అబ్బవరం నిర్మాణంలో రూపొందుతున్న ‘హత:’ చిత్రం విడుదల వాయిదా పడింది. తొలుత నవంబరు 6న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం తాజాగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఒకేసారి పలు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులకు మెరుగైన థియేట్రికల్‌ సౌండ్‌, విజువల్‌ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో విడుదలను వాయిదా వేసినట్లు తెలిపింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. అనుష్‌ గోరక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కుష్లు మద్దాల, రెహ్మాన్‌, నమ్రిత తనూజ పుట్టస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్