బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘మాయలేడి’ ట్రైలర్‌ విడుదల

1 గంట క్రితం

‘మాయలేడి’ ట్రైలర్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 06:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రెండేళ్ల విరామం తర్వాత నటుడు రాకేష్‌ వర్రె ‘మాయలేడి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మధుమిత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాకేష్‌ వర్రె మాట్లాడుతూ.. ప్రస్తుతం యాక్షన్‌ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని, మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్లకు కొంత కొరత ఉందనే ఉద్దేశంతో ‘మాయలేడి’ని ఎంచుకున్నానని తెలిపారు. కథలోని ప్రత్యేకతను కాపాడుతూ మంచి వినోదాత్మక చిత్రంగా రూపొందించామని చెప్పారు. ప్రశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాకేష్‌ వర్రె స్వయంగా నిర్మించారు. నవంబరు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్