ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : దేశంలో, రాష్ట్రంలో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా క్రైస్తవ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సంఘ మిత్ర ఆర్ ఎస్ జాన్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రం లో అన్ని చర్చిల పాస్టర్లతో , సంఘాల సభ్యులు తో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఎంతో మేలు , మిషనరీలు చేసిన సేవలు , నాగరికత నేర్పిన క్రైస్తవులుపై దాడులు చేయడం దారుణమన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాల్సిందే నని డిమాండ్ చేశారు . అగ్రవర్ణాలు ఎవరైనా మతం మారితే వారి కి రిజర్వేషన్లు యధావిధిగా వర్తింప జేస్తూ కేవలం దళితులు క్రిస్టియన్ లుగా మారితే వారి కి రిజర్వేషన్లు వర్తింపజేయడం లేదన్నారు. లౌకిక వాద దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాలరస్తున్నాయని మండి పడ్డారు. రాజ్యాంగంలో ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించి, ప్రకటించుకునే హక్కు ఉన్నా సువార్తికులపై దాడులు చేస్తున్నారన్నారు. అలాగే మతం మారితే కులం మారదని , అగ్ర వర్ణాలు క్రైస్తవులుగా మారితే వారి రిజర్వేషను కు ఎలాంటి ఇబ్బంది లేదని అదే దళితులు క్రైస్తవులుగా మారితే వారి రిజర్వేషను పోతుందని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ఇది క్రైస్తవ్యం పై జరుగుతున్న దాడి అని, రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న పరిణామాల పై ప్రభుత్వానికి శాంతి యుతంగా ర్యాలీ ద్వారా మా నిరసన తెలియజేస్తున్నామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, మత స్వాతంత్ర్యాన్ని కాపాడాలని కోరారు. క్రైస్తవుల హక్కులు పరిరక్షణ అంతా ఐక్య పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ పెడరేషన్ అధ్యక్షులు రెవ: బి.ఎం.రాజు, ఐజక్, ప్రేమానందం, ఆనందరావు, డానియల్, ప్రభాకర్, మధు, రవి కుమార్, మెజేస్ గేల్సన్, ఆదాడ మోహన్ రావు ,పలు చర్చిల పాస్టర్లు, సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
క్రైస్తవుల పై దాడులకు నిరసనగా ... నగరంలో భారీ శాంతి ర్యాలీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 08, 2026, 05:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)