ప్రజాశక్తి-పోలవరం : అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉద్ధృతి పెరిగింది. పోలవరం వద్ద నదిలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలవరం ప్రాజెక్టులోని 48 గేట్ల ద్వారా 5,36,938 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే వద్ద నీటిమట్టం 30.720 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న గంటల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలవరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి
44 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 07:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)