శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు.. షేక్ జాన్ సైదా అరెస్ట్‌

1 గంట క్రితం

arest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 07:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న షేక్ జాన్ సైదాను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో ఓ హోటల్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో పదో తరగతి చదువుతున్న విద్యార్ధినిని షేక్ జాన్ సైదా మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. బాలిక కిడ్నాప్‌పై తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక ఆచూకీని కనిపెట్టడంలో విఫలమవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరికి నిందితుడిని హర్యానాలో అరెస్ట్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్