శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ఫుల్.. తిరుమలకు పెరిగిన రద్దీ

1 గంట క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 08:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో వెలుపల క్యూలైన్లలోనూ యాత్రికులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని యాత్రికులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,374 మంది యాత్రికులు దర్శించుకోగా, 35,241 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.03 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తులు కాలినడక మార్గాలు, బయట ఏర్పాటు చేసిన రింగు రోడ్డు క్యూలైన్లలో గంటల తరబడి వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్