టిప్పర్ లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుల దుర్మరణం
ప్రజాశక్తి-విశాఖపట్నం: గాజువాక కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే దువ్వాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)