ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసెల్‌..హల్‌సెల్‌

12 నిమిషాల క్రితం

cell phone (1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 09:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మేలెంత చేసేనో ఈ సెల్,

వాస్తవంలో బ్రతుకు నీల్!

నిర్జీవమైనాయి బాడీసెల్,

మనిషిని మార్చేసింది ఈ జైల్!


బంధాలన్నింటికీ పెట్టెను సీల్,

మనసుల ప్రేమే ఆవిరి ఫీల్.

సంతోషాలన్నీ ఆన్‌లైన్ డీల్

కంటికి కన్నీరే మిగిలిన విల్!


చదువుల ప్రగతికి వేసెను బ్రేక్,

నవ్వులన్నీ అయ్యెను ఫేక్.

సమయమంతా దీనికే టేక్,

జీవితమే ఒక పెద్ద మిస్టేక్!


నిజమైన లోకాన్ని చేసెను బ్లాక్,

నిశ్శబ్ద రోగాలెన్నో ఎటాక్!

ఆలోచనలన్నీ తప్పుడు ట్రాక్,

మనిషి బ్రతుకే ఆగిపోయిన క్లాక్!


యంత్రానికి దాసోహమనెను మైండ్,

కళ్ళకు కట్టెను చీకటి బ్లైండ్!

ఇప్పటికైనా కాకుంటే కైండ్,

మనుషుల ఉనికే దొరకదు ఫైండ్


అగాధంలోకి నెట్టేసే ఈ ట్రెండ్,

ఇలాగే ఉంటే జీవితమే ఎండ్..!

పరిమితిగా వాడితేనే ఇది ఫ్రెండ్

హద్దు మీరితే మనిషి కి తప్పదు బెండ్!

ధనలక్ష్మి

8123772783

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్