నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మ టీచర్ అవ్వాలనుకుంది. కానీ తన పరిస్థితులు బాగోక గృహిణిగా ఉంది. కానీ నేనూ అలా అవ్వాలని మా అమ్మ కోరుకోవడం లేదు. నేను బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, లేకపోతే డాక్టర్ అయినా అవ్వాలని మా అమ్మ కోరుకుంటుంది. నాకు మా నాన్న అంటే చాలా గౌరవం. మా నాన్న కూడా డాక్టర్ అవ్వాలనుకున్నారు. కానీ వాళ్ల నాన్న చనిపోవడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డారు. నేను డాక్టర్ అవ్వడం మా నాన్న కల. నేను మా తల్లిదండ్రుల కలను, నా లక్ష్యంగా చేసుకున్నాను. అది చేరుకోవడానికి కష్టపడి చదువుతాను. భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకొని, మా తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటాను.
దీపికా శ్రీ
3వ తరగతి, అరవింద మోడల్ స్కూలు,
మంగళగిరి, గుంటూరు జిల్లా.







కామెంట్‌లు (0)