మనుషులు వెళుతుంటే
పండగలా చూసేది.
ఆకలి చీకటిలా అలముకుంటుంటే
వెన్నెముకలకు అమ్మ వొడయ్యేది
దప్పిక తీరే గొంతులో
శ్రమ స్వరాన్ని వినేది.
మూనలేసిన చేతులు ఒనుకుతుంటే
పశ్చిక పానుపుతో ఆశరా ఇచ్చేది
పొద్దు పొద్దికీ రంగులు మారుతున్నా
అలసట తీరిన దేహాలను చూసి మురిసేది.
మనుషులు మనసుల్లేక
పరుగు పెడుతుంటే...
దుఃఖాన్ని కక్కలేక మింగలేక
ఒంటరిగా నిలబడిపోయింది
మా పొలిమేర గట్టు.
కొత్తపల్లి మణీత్రినాథరాజు
8008606268







కామెంట్‌లు (0)