ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విశాఖలో ఈ నెల 19న ఇళ్ల పట్టాల పండగను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. పేద ప్రజలు నివసిస్తున్న ఇళ్లపై పూర్తి హక్కులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అందులో భాగంగా 25,880 మంది పేదలకు సిఎం ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో 11 మండలాల పరిధిలో దాదాపు 400 ఎకరాల్లో నివాసాలు నిర్మించుకున్న 25,880 కుటుంబాలకు వివిధ జిఒల కింద పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే జిఒనంబర్ 30 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మందికి ఇంటి స్థలాలపై హక్కులు కల్పించామని, మరో 9 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో మంగళగిరి నియోజకవర్గంలోనే 5 వేల కుటుంబాల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించినట్లు పేర్కొన్నారు.
Print Editionరేపు విశాఖలో ఇళ్ల పట్టాల పండగ
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 06:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)