mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'ఒక అద్భుతమైన వ్యక్తిని నా జీవిత భాగస్వామిగా పొందాను` : సిఎం చంద్రబాబు

4 గంటల క్రితం

"I have found a wonderful person as my life partner": CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 01:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : 'ఒక అద్భుతమైన వ్యక్తిని నా జీవిత భాగస్వామిగా పొందాను` అని సిఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య, హెరిటేజ్ ఫుడ్స్ అధినేత్రి నారా భువనేశ్వరి పుట్టినరోజును పురస్కరించుకొని ఆమెకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఒక మంచి భార్యగా, తల్లిగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా తమ జీవితాలకు భువనేశ్వరి ఒక వెలుగని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని పొగుడుతూ ... "ఆమెలోని సౌమ్యత, దయాగుణం, సమాజంలో ఒక మంచి మార్పును తీసుకురావాలనే తపన ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. భువనేశ్వరి ఎల్లప్పుడూ కరుణతో నడుచుకుంటూ, ఉదారత్వంతో ఇతరులకు తనవంతు తోడ్పాటునందిస్తారు. తను చేపట్టే ప్రతి పాత్రకు (భార్యగా, తల్లిగా, సామాజిక కార్యకర్తగా) ఒక అందాన్ని, సంపూర్ణమైన అర్థాన్ని చేకూరుస్తారు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఒక అద్భుతమైన వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా పొంది, ఇంతటి సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని భువనేశ్వరితో పంచుకుంటున్నందుకు తాను ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నానని అన్నారు. ప్రతిరోజూ తమ కుటుంబ జీవితాన్ని మరెంతో ప్రకాశవంతంగా, ఆనందమయంగా మారుస్తున్నందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలం భువనేశ్వరికి ఎంతో అద్భుతంగా, ఆరోగ్యకరంగా సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మరోవైపు నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వేదికగా ఆమెకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చంద్రబాబు చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్