గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దళితులపై అక్రమ కేసులు తొలగించాలి

3 గంటల క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 10:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కెవిపిఎస్ డిమాండ్

ప్రజాశక్తి - విశాఖ: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జివిఎంసి) అధికారులు కాంట్రాక్టర్ మరియు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు కుమ్మక్కై ముగ్గురు అమాయక దళితులైన నాని, శివ, శ్రీను అనే ముగ్గురు కార్మికుల పైన ఐపిసి 304ఏ క్రింద కేసు బనాయించినందుకు కెవిపిఎస్ నిరసన వ్యక్తం చేసింది. జివిఎంసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు ఈ ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు టౌన్ కొత్త రోడ్డు దీప్తి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద చెట్టు కొమ్ములు కొడుతుండగా ఇందులో ఇద్దరు కార్మికుల వారించినప్పటికీ వేగంగా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రావటం ఆ వ్యక్తి మీద కొమ్మపడి తీవ్ర గాయాలతో కింగ్ జార్జ్ హాస్పిటల్స్ చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయిన ఆరు మాసాల తర్వాత మరణించారు. 2023 నవంబర్ 18న జరిగిన సంఘటనపై ముగ్గురు కార్మికులు ఎటువంటి తప్పు చేయనప్పటికీ ఆ కాంట్రాక్టర్, జివిఎంసి అధికారులు కేసులో ఈ ముగ్గురిని ఇరికించారు. వన్ టౌన్ పోలీసులు కార్మికులను బెదిరించి తప్పు చేసినట్లు ఒప్పించి IPC 304 A క్రింద కేసు బనాయించారు. నాన్బెల్ బుల్ రావడంతో తీవ్ర మనస్తాపం చెంది శ్రీను అనే కార్మికుడు మరణించారు. మిగతా కార్మికులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. లాయర్ ఖర్చులు రవాణా ఖర్చులు భారంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ ముగ్గురిని దోషులుగా నిలబెట్టి జివిఎంసి మరియు కాంట్రాక్టర్ కేసుల నుంచి తప్పించుకున్నారని ఆగ్రహించారు. ఈ క్రమంలో వీరి జీవనోపాధి కూడా కష్టతరంగా మారింది. కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయని తెలిపారు. కేసుని పూర్వపరాలు సమగ్రంగా దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చమని ఎసిబి విభాగం అధికారులకు కెవిపిఎస్ విజ్ఞప్తి చేసింది. విజ్ఞప్తి చేసింది.

1. సరైన దర్యాప్తు లేకుండా కార్మికులచే బలవంతంగా తప్పు ఒప్పించినందుకు వన్ టౌన్ పోలీసులపై చర్య తీసుకోవాలని,

2. కాంట్రాక్టర్ సేఫ్టీ పరికరాలు సమగ్రంగా సరఫరా చేయకుండా ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకోకుండా పనులు చేయించడం వల్ల ప్రమాదం జరిగిందని సదర వ్యక్తి గ్రంధి సాధురావు పైచర్య తీసుకోవాలని,

3. ప్రమాదానికి గురి అయిన వ్యక్తి నష్టపరిహారం చెల్లించడం కానీ జివిఎంసిదే కానీ అలా జరగడం లేదు.

కెవిపిఎస్ పై డిమాండ్లను పరిష్కరించాలని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ ఉపాధ్యక్షులు వై రాజు, కార్యదర్శి ఎం సుబ్బారావు, కెవిపిఎస్ నాయకులు ఈశ్వరరావు, సూపర్వైజర్ అప్పలరాజు, బాధితులు బండ శివ, నాని భార్య స్వర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్