- మంత్రి లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళల్ని అవమానించి రాక్షస ఆనందం పొందడం వైసిపి డిఎన్‌ఎలోనే ఉందని టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. సొంత తల్లిని, చెల్లిని గెంటేసిన చరిత్ర వైసిపి అధినేత వైఎస్ జగన్‌దైతే కనిపించిన ప్రతి మహిళను అవమానించడం ఆ పార్టీ నాయకులు సంస్కృతి అని శుక్రవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై వైసిపి నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని తెలిపారు. మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమించి మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేరస్థుడిని పరామర్శించడం ఆశ్చర్యకరం: గొట్టిపాటి రామకృష్ణ
మాజీముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేరస్థుడిని పరామర్శించడానికి వెళ్లడం తీవ్ర ఆశ్చర్యకరమని టిడిపి నేత గొట్టిపాటి రామకృష్ణ అన్నారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన స్వార్థ రాజకీయాల కోసం చట్టాలను, నిబంధనలను పూర్తిగా జగన్ పక్కనబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని వస్తున్న వేళ, ప్రోటోకాల్, భద్రతా చర్యలను విచ్ఛిన్నం చేసేలా వ్యవహరించారని పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడే విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగడం, వారిపై బలప్రయోగం చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని తెలిపారు. చట్టాలను ఉల్లంఘించి జగన్ సాధించిందేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)