కాజీపేటలో టీడీపీ తీరుపై చర్చ..
ప్రజాశక్తి – కాజీపేట: కాజీపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా వింత ఘటన చోటుచేసుకుంది. టిడిపి తరఫున నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఆ పార్టీకి చెందిన నాయకులు లాక్కుని పరుగులు తీశారు.. సొంత పార్టీ తరఫున నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థుల విషయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం అక్కడ ఆసక్తికర చర్చకు దారితీసింది. తొలుత అభ్యర్థిని గుర్తించలేక బయటకు పంపించే ప్రయత్నం చేసిన టీడీపీ నాయకులు, ఆ తర్వాత విషయం గుర్తించి అప్రమత్తమైనట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ అగ్రనాయకులు జోక్యం చేసుకుని అభ్యర్థిని నామినేషన్ దాఖలు చేసేందుకు కార్యాలయంలోకి తీసుకెళ్లారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.







కామెంట్‌లు (0)