ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: విశాఖపట్నంలో వచ్చే నెల11వ తేదీన జరిగే ‘ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో – 2026’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఎపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు ఆహ్వానించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రిని ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు గారు, ప్రతినిధి లక్ష్మీనారాయణ గురువారం కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు ఎక్స్‌పో వివరాలను మంత్రికి వివరించారు. రాష్ట్రాన్ని ఐటీ, పోర్ట్-ఆధారిత అభివృద్ధి, ఫిన్‌టెక్ మరియు అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వచ్చే నెల 11 నుంచి మూడు రోజుల పాటు ఈ బిజినెస్ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ ప్రదర్శనలో గ్రీన్ ఎనర్జీ, ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాలకు చెందిన 500కి పైగా ఎంఎస్‌ఎంఈలు, 60కి పైగా స్టార్టప్‌లు, 180కి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తారని, మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోకు దాదాపు 40,000 మందికి పైగా సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు ఛాంబర్స్ ప్రతినిధులు తెలిపారు.
Print Editionమంత్రి కొండపల్లికి బిజినెస్ ఎక్స్‌ఫో ఆహ్వానం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 11:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)