ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ : తుఫాను ప్రభావంతో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరంలోని పలు ఇరిగేషన్ కార్యాలయాలు నీటమునిగాయి. కార్యాలయాలు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వర్షపు నీరు పెద్దఎత్తున ఆవరణలోకి చేరింది. కొన్ని కార్యాలయ గదుల్లోకి కూడా నీరు ప్రవేశించింది.
దీంతో విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాల్లోకి చేరిన వర్షపు నీటిని సిబ్బంది బయటకు పంపిస్తున్నారు. నీరు నిలిచిపోవడంతో పలు ముఖ్యమైన పనులకు అంతరాయం ఏర్పడుతోంది. చాలావరకు ఇరిగేషన్ కార్యాలయాలు బ్రిటిష్ కాలం నాటి కట్టడాల్లో ఉండటంతో, అవి దిగువ ప్రాంతంలో ఉన్నాయని సిబ్బంది తెలిపారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరుతోందని వారు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)