గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారీ వర్షాలకు గుంతలమయమైన రోడ్డు

39 నిమిషాల క్రితం

road.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 11:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – పెరవలి (తూర్పుగోదావరి జిల్లా) : కానూరు గ్రామంలోని అంబేద్కర్ కాలనీ వద్ద నర్సాపురం–నిడదవోలు ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమైంది. స్వల్ప వర్షానికే రోడ్డుపై నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తోంది. దీంతో రోజువారీ ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గతంలో గుంతలను పూడ్చినప్పటికీ భారీ వర్షాలకు అవి మళ్లీ ఏర్పడి, వర్షపు నీటితో నిండిపోతున్నాయి. దీంతో రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. భారీ వర్షాలకు చిన్న గుంతలు మరింత పెద్దవిగా మారడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

రోడ్డుపై గుంతల్లో నీరు నిలిచిపోకుండా అంబేద్కర్ కాలనీకి చెందిన యువకులు స్వయంగా గాళ్లు కొట్టి నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

roads.jpeg

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్