మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి : కెవిపిఎస్‌

48 నిమిషాల క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 1,800 మంది పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బి లావణ్యవేణిని తాడేపల్లిలో మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ.. గురుకుల విద్యా సంస్థల్లో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రతినెలా సకాలంలో వేతనాలు అందేలా శాశ్వతమైన చెల్లింపు విధానాన్ని రూపొందించి అమలు చేయాలన్నారు. పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు స్పష్టమైన పని బాధ్యతలు, పని వేళలు, సెలవులు, సీనియారిటీ రక్షణ, నిరంతర సేవ కొనసాగింపు, మెరుగైన వేతనాలు, భవిష్యత్ భద్రత, వైద్య, ఇతర సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు సిహెచ్ మృగారెడ్డి, గురురత్నం, ఇస్మాయిల్, వర్మ, ఏసోబు, ప్రకాష్, శ్యామ్, రవికుమార్, కోటేశ్వరరావు, నారాయణ, మహిళా అధ్యక్షులు జ్యోతి, జీవన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్