mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రతిపాదించిన యుడిఎఫ్ ఛార్జీలు రద్దు చేయాలి

2 గంటల క్రితం

cpm logo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 11:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విశాఖపట్నం ఎయిర్‌పోర్టును కొనసాగించాలి : సిపిఎం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రతిపాదించిన యుడిఎఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, విశాఖపట్నం ఎయిర్‌పోర్టును కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. దీనిపై మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నూతనంగా ప్రారంభించిన భోగాపురం జిఎంఆర్ విమానాశ్రయంలో వచ్చే, పోయే ప్రయాణికులందరి దగ్గర యూజర్ ఛార్జీలు వసూలు చేయడాన్ని వ్యతిరేకించింది. భోగాపురం ఎయిర్‌పోర్టు నుండి వెళ్ళే దేశీయ ప్రయాణికులకు రూ.835, బయటి నుండి భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా వచ్చే ప్రయాణికులకు రూ.355 యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యుడిఎఫ్) వసూలు చేస్తారని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నుండి వెళ్ళే విదేశీ ప్రయాణికులకు రూ.1255, బయటి నుండి వచ్చే విదేశీ ప్రయాణికులకు రూ.545 యుడిఎఫ్ ఫీజు వసూలు చేస్తారని వివరించారు. ఒకసారి దేశం లోపల (డొమెస్టిక్) ప్రయాణిస్తే రానూపోనూ దాదాపు రూ.1,300 అదనంగా చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టును ఎత్తేసి కొత్తగా భోగాపురం ప్రారంభించినందుకు ప్రయాణికులపై ఇలా “జరిమానా” విధించడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రయివేటీకరణ వల్ల సమర్దత, ధరలు తగ్గుతాయని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్న మాటలకు ఇది విరుద్దంగా ఉందని వివరించారు. యూజర్ డెవలప్‌మెంట్ ఫీజుల ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. జూలైలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని పలు ప్రకటనలు వచ్చినా ఇప్పటి వరకు విశాఖ నగరం నుండి భోగాపురం చేరుకునేదానికి పూర్తిస్థాయిలో రహదారుల ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. విశాఖ నగరం నుండి వెళ్లే ప్రయాణికులు సమయం, ప్రయాణ రీత్యా పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో ఉన్న విమానాశ్రయాన్ని కొనసాగించాలన్న ప్రజల కోర్కెను గౌరవించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యుడిఎఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, విశాఖ ఎయిర్‌పోర్టు కొనసాగేటట్లు చూడాలని సిపిఎం డిమాండ్ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్