ప్రజాశక్తి-విజయవాడ : జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి, వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులకు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ వేలాది మంది జూనియర్ డాక్టర్లు తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహిస్తూ, రోగులకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వారి శ్రమకు తగిన విధంగా స్టైఫండ్ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జూనియర్ డాక్టర్లు కోరుతున్న విధంగా 30 శాతం స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వ వైద్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే నాలుగు రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర సేవలను బహిష్కరించనున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే అంగీకరించాలని వి. శ్రీనివాసరావు కోరారు. సమ్మెకు దారితీయకుండా ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.
జూనియర్ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : సిపిఎం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 01:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)