శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్బన్ సిఐ పి.రమేష్‌కు ఉత్తమ సేవా ప్రశంసా పత్రం..

1 గంట క్రితం

ramesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 01:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–చిలకలూరిపేట: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్‌డివిజన్ పరిధిలో విశిష్ట సేవలందించిన చిలకలూరిపేట అర్బన్ సీఐ పి. రమేష్ ఉత్తమ పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆయన కనబరిచిన అంకితభావానికి గుర్తింపుగా శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. సబ్‌డివిజన్ స్థాయిలో ఉత్తమ పోలీస్ అధికారిగా అవార్డు దక్కించుకున్న సీఐ రమేష్‌ను పోలీసు శాఖ అధికారులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్