మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

59 మంది ఆర్ఎంసి అధికారులు, ఉద్యోగులకు సేవా పురస్కారాలు

15 ఆగస్టు, 2026

east godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 02:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఆర్ఎంసికి చెందిన 59 మంది ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి చేతులమీదుగా అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో అడిషినల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ, సెక్రటరీ జి.శైలజవల్లి, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎంహెచ్ఓ ఎ.వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, రెవిన్యూ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, అకౌంటెంట్ ఆర్.నాగమణి, సీఎంఎం వి.రామలక్ష్మి, ఈఈలు ఎం.వి.కె.మాధవి, మదర్షా అలీ, డిప్యూటీ సిటీ ప్లానర్ పి.నాయుడు, ఇతర ఆర్ఎంసి అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్