శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జెఎంజె మహిళా కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 గంట క్రితం

mlc ls
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–తెనాలి (గుంటూరు జిల్లా): స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు సాగించిన పోరాటాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు అన్నారు. స్థానిక జెఎంజె మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను ఓడించడంతో భారత్‌లో బ్రిటిష్ రాజకీయ ఆధిపత్యానికి పునాది పడిందన్నారు. 1765లో కంపెనీకి బెంగాల్‌లో దివానీ హక్కులు లభించాయని, అనంతరం యుద్ధాలు, ఒప్పందాలు, ఆక్రమణల ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలపై బ్రిటిష్ ఆధిపత్యం విస్తరించిందని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ శాంత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత లక్ష్మణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ రోజ్‌లిన్, తెలుగు శాఖాధిపతి డాక్టర్ బి. మేరీ కుమారి, డాక్టర్ ఎం. అరుణ, అధ్యాపకులు సి.హెచ్. సరోజిని, దాసరి ఉమాశ్రీ, పూజ, రత్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్