శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హార్ముజ్‌లో యుఎఇ చమురు సంస్థ నౌకపై దాడి

1 గంట క్రితం

UAE
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దుబాయ్‌ : హార్ముజ్‌ జలసంధిలో తమ నౌకల్లో ఒకదానిపై దాడి జరిగిందని యునైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌ (యుఎఇ)కి చెందిన అతిపెద్ద చమురు సంస్థ అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఎడిఎన్‌ఒసి) శనివారం తెలిపింది. హార్ముజ్‌లో ప్రయాణిస్తుండగా శుక్రవారం సాయంత్రం తమ నౌకల్లో ఒకదానిపై దాడి జరిగిందని ఎడిఎన్‌ఒసి ధ్రువీకరించిందని అధికారిక మీడియా డబ్ల్యుఎఎం తెలిపింది. అయితే ఎవరికి గాయాలు కాలేదని పేర్కొంది. నౌకా సిబ్బందిని రక్షించడం, నౌకాయాన స్వేచ్ఛను, సముద్ర భద్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఎడిఎన్‌ఒసి స్పష్టం చేసింది. ఆ జలసంధి గుండా వెళ్తున్న ఎడిఎన్‌ఒసికి చెందిన రెండు నౌకలపై ఇరాన్ దాడి చేసిందని యుఎఇ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది. ఇరాన్ శత్రుపూరిత దాడిని ఖండిస్తున్నట్లు యుఎఇ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. గత వారం, హార్ముజ్‌లో తమ మూడు ట్యాంకర్లపై దాడి జరిగిందని ఎడిఎన్‌ఒసి వెల్లడించగా, మరో ట్యాంకర్ పై దాడి జరిగినట్లు యుఎఇ విదేశాంగ శాఖ మరుసటి రోజు మరో ప్రకటనలో తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్