ప్రజాశక్తి-అమరావతి: అంబేద్కర్ కోనసీమ జిల్లా సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.ఒడిశా రాష్ట్రంలోని పరదీప్ తీరానికి మత్స్యకారులు చేరుకున్నట్లు తెలిపారు.వేటకు వెళ్లిన కొద్ది రోజులకే సముద్రంలో వీచిన ఈదురుగాలులు,ప్రతికూల వాతావరణం కారణంగా వీరి పడవ మార్గం తప్పి కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయకపోవడంతో తీర ప్రాంత అధికారులకు గానీ,కుటుంబ సభ్యులకు గానీ సమాచారం అందించడం సాధ్యపడలేదు.గల్లంతైన వారి కోసం ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ అధికారులు,కోస్ట్ గార్డ్ బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.పొరుగు రాష్ట్రాల తీరప్రాంత భద్రతా దళాలను కూడా అప్రమత్తం చేశారు.ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ మత్స్యకారులు,స్థానిక కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ బోటును గుర్తించారు.తక్షణమే స్పందించి ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా తమ తీరానికి చేర్చి ప్రాథమిక వైద్య సహాయం అందించారు.మత్స్యకారులను తిరిగి తమ సొంత ఊళ్లకు సురక్షితంగా తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కోనసీమ మత్స్యకారులు సురక్షితం : మంత్రి అచ్చెన్నాయుడు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 26, 2026, 06:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)